Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్నగర్ :పార్లమెంట్లో మహిళా బిల్లును వెంటనే ఆమోదించాలని జాతీయ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశ్వరి అన్నారు.ఆదివారం నోటికి నల్ల గుడ్డ కట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ పార్ల మెంట్లో బిల్లును ప్రవేశపెట్టి 25 ఏండ్లవు తున్నప్పటికీ ఆమోదించక పోవడం దుర దష్టకరమన్నారు. మహిళా బిల్లును ఆమోదిం చినట్టయితే మహిళలపై జరిగే లైంగికదాడులు, వేధింపుల కేసులు తగ్గు ముఖం పట్టి మహిళలకు రక్షణ జరుగుతుందన్నారు. ప్రస్తుత పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించడం కోసం రాజకీయాలకతీతంగా మహిళా ఎంపీలతో పాటు ప్రతిపక్షం కూడా సహకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో మహిళాసంఘం నాయకురాలు నాగమణి, శ్రీలత, నాగజ్యోతి, శివజ్యోతి పాల్గొన్నారు.