Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీఎస్సీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
కోదాడరూరల్ :ప్రగతిభవన్‌పై నీలిజెండాను ఎగురవేస్తామని బహుజన పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.ఆదివారం పట్టణంలోని పెరిక హాస్టల్ భవన్లో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో పలు పార్టీల నుండి బీఎస్పీలోకి చేరిన వారికి నీలికండువా కప్పి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణరాష్ట్రం కోసం నాడు అమరుడైన శ్రీకాంతాచారి బహుజనుడు అని, నీలికండువాను రెపరెపలాడించిన వీరుడన్నారు. నీలికండువా రాకతోనే రాష్ట్రంలో 30 లక్షల మందికి ఉపాధి దొరికిందని స్పష్టం చేశారు.ప్రజలను ధ్వేషించకుండ పాలన చేస్తున్నారని, నీలికండువా రాకతోనే అన్ని కులాల మతాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం బహుజనులకు అభివద్ధి ఫలాలు దక్కేలా బహుజన పార్టీ నిరంతరం కషి చేస్తుందన్నారు.నీలి కండువా అమ్ముడుపోని... మడమతిప్పని త్యాగనిరతి గల పార్టీ అని అన్నారు.రాబోయే రోజుల్లో ప్రగతిభవన్‌పై నీలికండువా ఎగరవేయడం ఖాయమన్నారు. ఏనుగుగుర్తును గ్రామగ్రామాన అన్ని వర్గాల వారికి చెరువు చేయాలన్నారు.ఓట్లు మావి.. సీట్లు మివా అని ప్రశ్నించారు.ఓట్లు మావే.. సీట్లు మావే అని కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు.అంతకుముందు బీఎస్పీ డివిజన్ ఆధ్వర్యంలో పట్టణ శివారు నుండి ప్రవీణ్‌కుమార్‌కు ఘన స్వాగతం పలికారు. పట్టణశివారులో నుండి వందలాది మంది కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో నినాదాలు చేస్తూ ర్యాలీ పెరిక భవన్ కు తరలొచ్చారు.అనంతరం ఆయన పట్టణంలోని హుజూర్నగర్రోడ్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.పార్టీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు గుండెపంగురమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి పగిడిమర్రి బాబురావు, దాసరి శ్రీనివాస్‌యాదవ్, జిల్లా అధ్యక్షులు చడపంగురవి, జిల్లా మహిళా కన్వీనర్ బలుగూరిస్నేహలత, నియోజకవర్గ కోశాధికారి కందుకూరిఉపేందర్, ప్రధానకార్యదర్శి మామిడిరవి, సీనియర్‌నాయకులు కుటుంబరావు, రాజేందర్, కొండమీదికొండలు, శ్రీనివాస్, సోమయ్య, రెమిడాల. లింగయ్య, దైదసురేందర్, శ్రవణ్, పుల్లయ్య, విజయనిర్మల, దశరథ, ప్రేమ్‌కుమార్, కిరణ్ పాల్గొన్నారు.