Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలువురిపై కేసులు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జున సాగర్పైలాన్కాలనీ కొత్త బ్రిడ్జి చెక్‌పోస్టు వద్ద పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురు పట్టుబడ్డారు.10 మందిపై కేసులు నమోదు చేయగా 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠినచర్యలు తీసుకుంటామని విజయపురి టౌన్ ఎస్సై నర్సింహారావు హెచ్చరించారు.శని,ఆదివారం ఈ తనిఖీలు కొనసాగాయి.ఈ కార్యక్రమంలో ఏఎస్సై వెంకట్‌రెడ్డి,హోంగార్డులు ప్రభు, నర్సింహ పాల్గొన్నారు.