Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
పట్టణానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీపీఐ(ఎం)లో చేరారని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి నాగారపు పాండు తెలిపారు. ఆదివారం స్థానికంగా ఆయన మాట్లాడారు.గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో హుజూర్నగర్కు చెందిన టీఆర్ఎస్ నాయకులు శీలం శ్రీనుతో పాటు 40 కుటుంబాల వారు ఆ పార్టీని వీడి తన అనుచరులతో కలిసి సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ల సమక్షంలో పార్టీలో చేరారన్నారు. పార్టీలో చేరిన వారిలో వెంకటేష్ నాయక్,కాలింగి వెంకీ, మామిడి వీరబాబు, నర్సింహారావు, లక్ష్మయ్య, సైదులు, వీరబాబు, వినరు పాల్గొన్నారు.