Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళపతి బిపిన్ రావత్‌కు, సైనికులకు మండలపరిధిలోని లింగాల గ్రామంలో పార్టీలకతీతంగా ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అమరులైన సైనికులకు జోహార్లు అంటూ కొవ్వొత్తులు చేతపట్టి విధుల వెంట ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా మహిళా నాయకురాలు గార్లపాటిస్వర్ణ, కాంగ్రెస్ మండలనాయకులు దొంగరిగోపి, మాజీ ఎంపీపీ నల్లపుశ్రీను, దొంగరిగోవర్ధన్, బహుజన సమాజ్ పార్టీ యూత్ నాయకులు రణపంగశ్రవణ్, రణపంగరాజేష్, గ్రామస్తులు రామకష్ణ, సైదులు, శంకర్, అనిల్, సోమయ్య, విక్రమ్ పాల్గొన్నారు.