Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలో అబ్దుల్‌కలాం విగ్రహం ఏర్పాటు చేయడం అభినంద నీయమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.ఆదివారం పట్టణంలోని గాంధీపార్క్‌లో కిట్స్ కళాశాల చైర్మెన్ డాక్టర్ నీలా సత్యనారాయణ, గౌరవసలహాదారులు విశ్రాంత ప్రిన్సిపాల్ పోతుగంటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తనజీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు.తన జీవితమంతా ఇస్రోకు అంకితం చేసి ప్రపంచ దేశాలకు దీటుగా ఉపగ్రహాలను తయారుచేసి దేశానికి వన్నె తెచ్చారని ఆయన సేవలను స్మరించారు. సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులు కలాం ఆశయాలను సాధించాలన్నారు.దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవిని చేపట్టిన కనుమూసే వరకు సామాన్య మానవునిలా జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి అబ్దుల్‌కలాం అన్నారు.ఓ శాస్త్రవేత్త విగ్రహాన్ని కోదాడలో ఏర్పాటు చేయడం గర్వకారణ మన్నారు.విగ్రహఏర్పాటుకు కషి చేసిన బాధ్యులను అభినందించారు. భవిష్యత్తరాలకు ఈ విగ్రహాలు స్ఫూర్తినిస్తాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తామన్నారు.వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ శిరీష లక్ష్మీ నారాయణ,ఎంపీపి కవిత రాధారెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు ఒంటిపులి నాగరాజు, పైడిమర్రి సత్య బాబు,పట్టణ కౌన్సిలర్లు గుండెలసూర్యనారాయణ, ఖదీర్‌పాషా, వెంకటేశ్వర్లు,లలిత, శ్రీనివాస్‌యాదవ్, రాజశేఖర్, నాయకులు ఉపేందర్‌గౌడ్, రాయపూడి వెంకట నారాయణ,రోజారమణి, నిర్మల, గ్రంథాలయ చైర్మెన్రహీం, బత్తులఉపేందర్, పాల్గొన్నారు.