Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
వ్యాపారాల అభివద్ధి తోనే పట్టణ అభివద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని గుడిబండ రోడ్ లో లక్ష్మీ శ్రీనివాస ఫ్యామిలీ దాబా రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా అభివద్ధి చెందాల న్నారు.తాము ఉపాధి పొందడంతో పాటు మరో 10 మందికి ఉపాధిఅవకాశాలు కల్పించాలన్నారు.నాణ్యమైన సేవలతో వినియోగ దారుల మన్నలను పొందాలన్నారు.శరవేగంగా అభివద్ధి చెందుతున్న పట్టణంలో అన్ని వ్యాపారాలకు అనువుగా ఉంటుందన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితారాధారెడ్డి, డాక్టర్ సుబ్బారావు, టీఆర్ఎస్ నాయకులు ఒంటిపులి నాగరాజు, సాథినేని అప్పారావు, మల్లెల బ్రహ్మయ్య, పుల్లయ్య, నిర్వాహకులు చంద్రగిరి నవీన్‌కుమార్, జిడుగు శ్రీనివాసరావు,మాధవరావు, వాసు పాల్గొన్నారు.