Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ తరగతులు ప్రారంభమైనట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని కళాశాల ఆవరణలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా ఓపెన్ యూనివర్సిటీ క్లాసులకు హాజరు కావాలన్నారు .అనంతరం కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యయన కోఆర్డినేటర్ డి కిషన్ ,కౌన్సిల్ కిష్టయ్య, అంతయ్య, జెవి సత్యనారాయణ ,ఈశ్వర్, బి.అంజయ్య, స్వరూప, మహేశ్వరి, సంపత్‌కుమార్, రేవంత్ ,ఎమ్ రవీందర్ , సిబ్బంది ఉపేంద్ర ,యూసఫ్, జాని , తదితరులు పాల్గొన్నారు.