Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా సమాచారం ఇవ్వని కార్యాలయ సిబ్బంది
జిల్లా మత్స్యశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్డిన కార్మికులు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
పట్టణంలో మత్స్య కార్మికుల గుర్తింపు కొరకు ప్రభుత్వం నిర్వహించే స్కిల్ టెస్ట్‌లు ఈనెల 13,14, 15వ తేదీలలో నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ జిల్లా కేంద్రంలో స్కిల్‌టెస్ట్ నిర్వహించడం లేదంటూ జిల్లా మత్స్య శాఖ కార్యాలయం వద్ద సోమవారం మత్స్య కార్మికులు ఆందోళన నిర్వహించారు.కోర్టు ఆదేశాలు మత్స్య శాఖ అధికారులు పాటించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.అయితే జిల్లా మత్స్య శాఖ అధికారి ఆరోగ్యం బాగాలేక సెలవులో వున్నారని, అందుకే కోర్టు ఆదేశాల మేరకు స్కిల్ టెస్ట్ పెట్టలేదని కార్యాలయం సిబ్బంది తెలిపారు. అయితే స్కిల్‌టెస్ట్ నిర్వహించడం లేదని తమకు ముందుగా తెలియ జేయలేదని మత్స్య కార్మికులు అన్నారు.జిల్లాలో మత్స్య శాఖ పనితీరు అధ్వానంగా ఉందని ఆరోపించారు.దాదాపుగా వందమంది మత్స్య కార్మికులు చేపలు పట్టే వలలు తీసుకుని కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.అయితే అధికారికి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కార్మికులకు స్కిల్ టెస్ట్ నిర్వహించడం లేదని కార్యాలయం ఇన్చార్జి పత్రికాముఖంగా తెలియజేయకపోవడం గమనార్హం.ఈ కార్యక్రమంలో మత్స్య కార్మికులు పాల్గొన్నారు.