Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
స్థానిక 18వ వార్డులోని మైనారిటీ గురుకుల పాఠశాలను మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న మైనారిటీ గురుకుల పాఠశాలలో 638 మంది విద్యార్థులు చదువు తున్నార న్నారు. అంతమంది విద్యార్థులు ఆ బిల్డింగ్లో ఉండడంతో తాగునీటి, డ్రయినేజీ సమస్య లను ఎదుర్కుంటున్నార న్నారు.వాటి పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.బిల్డింగ్ ఓనర్ కూడా కొన్ని పనులు చేయాల్సిన వి ఉన్నాయన్నారు.వాటిని అతని దష్టికి తీసుకెళ్లామన్నారు. అదేవిధంగా అధ్యాపకులు, స్టూడెంట్స్ కోరిక మేరకు వాళ్ళు అడిగిన సొంత పాఠశాల భవనం గురించి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ దష్టికి తీసుకెళ్తామన్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న వసతులను పరిశీలించడంతో పాటు సమస్యల గురించి విద్యార్థులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇమాంషఫీ, కర్రీ శివ, సుబ్బారావు, పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది, మున్సిపల్ జవాన్ రమేష్ పాల్గొన్నారు.