Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైఫై కెమెరాల ఏర్పాటుకు సిఫార్సు
పాలకమండలి సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
గట్టుపైన ఉన్న మూడు గుండ్లపై ఉన్న హుండీని గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులకొట్టి చోరీ చేసిన సంఘటనపై గాల్లో దీపం చెరువుగట్టు హుండీ నాసిరకం కెమెరాలతో నిఘా ఎలా సాధ్యం ? అనే కథనంపై చెరువుగట్టు పాలకమండలి అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్ స్పందించి సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైఫై సీసీ కెమెరాల ఏర్పాటుకు దేవాదాయశాఖ కమిషనర్‌కు సిఫార్సు చేశారు.చోరీ ఘటనపై పూర్తిస్థాయిలో చర్చించారు.కోతుల బెడద ,ప్రకతి వైపరీత్యాలకు ఏలాంటి సమస్య రాకుండా వైఫై కెమెరాలు ఏర్పాటు చేయాలని, దీర్ఘకాలికంగా దేవస్థానం పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేయాలని, సిబ్బంది కొరతను అధిగమించేందుకు నూతన సిబ్బందిని నియమించడం కోసం కమిషనర్ కూ సిఫార్సు కార్యాలయానికి చేశారు.ఈ సందర్భంగా ఆయన 'నవతెలంగాణ' తో మాట్లాడుతూ చోరీఘటనలో ఎలాంటి ఆర్థికనష్టం జరగలేదన్నారు.వాట్సాప్‌లో, పత్రికల్లో,చానళ్లలో వస్తున్న విషయాలు వాస్తవం కాదని ఖండించారు.ఈ సమావేశంలో ఆలయచైర్మెన్ మేకల అరుణ, ఎంపీటీసీ రాజిరెడ్డి, పాలకమండలి సభ్యులు రాధారపు భిక్షపతి,పసునూరిశ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి, మేక వెంకట్‌రెడ్డి, సిగ శంకర్, ఆలయసిబ్బంది ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వంశీ పాల్గొన్నారు.