Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహకారంతో మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రేవల్లిసత్తమ్మ, లక్ష్మయ్య కుటుంబానికి రూ.50500 సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కాగా ఆ చెక్కును జిల్లా నాయకులు రఘపతి రెడ్డి, మండల అధ్యక్షులు పూల వెంకటయ్య, సింగిల్విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ, సింగిల్ విండో డైరెక్టర్ అన్నెపాక పార్వతమ్మ దావీదు లబ్దిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు పొనుగోటి గోపి, అన్నెపాకసాగర్, వాదసు లింగయ్య, కేశవులు, హరీష్, నాగరాజు, చిరంజీవి, ముత్తయ్య, నెంబర్ వెంకటయ్య, పెద్ద నర్సింహ, రమేష్, ఇద్దయ్య, వెంకన్న, భాస్కర్రావు, చిన్నవెంకటయ్య, చంద్రమౌళి, నరేష్ పాల్గొన్నారు.