Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి :అధికారుల అనుమతి లేకుండా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సరస్వతి అన్నారు .సోమవారం మండలపరిధిలోని స్టేజీ సమీపాన వ్యక్తి సర్వే నెంబర్ 202 లోని పదిగుంటల భూమిని ఆక్రమించుకొని బేస్మెంట్ నిర్మాణం చేస్తుండడంతో అక్కడికి చేరుకుని జేసీబీ సాయంతో ధ్వంసం చేసి ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల కింద ఓ దిన పత్రికలో వచ్చిన వార్తకు కొన్ని రోజులుగా విచారణ జరిపి అతని వద్ద ఎలాంటి అనుమతిపత్రాలు లేకపోవడంతో సోమవారం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ తెలిపారు. ఆయన వెంట ఆర్ఐ శ్రీనివాస్‌రెడ్డి, ట్రైనీ ఎస్సై శ్రీనివాస్, వీఆర్ఓలు మల్లయ్య, చాంద్‌పాషా ఉన్నారు.