Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ-నిడమనూరు
భూతగాదా నేపధ్యంలో అన్నపై తమ్ముడు దాడి చేసిన ఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది.ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నందికొండవారిగూడెం గ్రామానికి చెందిన బొంత లింగయ్య బొంత వెంకటేశ్వర్లు అన్నా తమ్ముళ్లు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి.కాగా సోమవారం బొంత వెంకటేశ్వర్లు తన అన్నా అయిన బొంత లింగయ్య ఇంటిపై దాడి చేసి గడ్డపార తో ఇంటి తలుపులు కిటికీలు పగులగొట్టాడు.అనంతరం పొలంలో ఉన్న మోటార్ స్టాటర్ బాక్స్‌లు, ఫీజులను పగులగొట్టాడు.లింగయ్య కుమారుడు హనుమంతును చంపుతానని బెదిరించాడు.బాధితుడు బొంత లింగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.