Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
హింసను వ్యతిరేకించడమంటే హక్కులను కాపాడుకోవడమేనని ఐద్వా జిల్లా ప్రధానకార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.సోమవారం ఎస్ఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ గర్ల్స్ జూనియర్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళల కోసం అనేక చట్టాలు న్నాయని, వాటన్నిటినీ విద్యార్థులు, మహిళలు అవగా హనతో తెలుసుకొని వాటి ద్వారా పొందే లాభాన్ని గ్రహించా లన్నారు. అనునిత్యం మహిళలు, విద్యార్థులపై జరుగుతున్న దాడులు వాస్తవమే అయినప్పటికీ ఏ విధంగా ఎదుర్కోవాలలి..వాళ్ళు సరైన రీతిలో తెలుసుకోలేక బలి అవుతున్నారన్నారు.విద్యార్థులు, మహిళలు, విద్యార్థులు అందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అదేవిధంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఇంట్లో గానీ, టీచర్లలో గానీ చెప్పాల్సిన అవసరం ముఖ్యమైనదన్నారు. ఈ సెమినార్లో సీఐ భీసన్న, ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ ప్రెసిడెంట్ బుడిగ వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు నిమ్మల పద్మ,గర్ల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సునీత, ఎస్ఎఫ్ఐ నాయకులు అంజనేయులు, దేవేందర్, రాజు, శశి, సులోచన, కళాశాల విద్యార్థులు శ్రీజ, చిత్ర, కష్ణవేణిపాల్గొన్నారు.