Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
మండలంలోని కుర్మపల్లిలో శివమాల ధరించి మండల దీక్ష పూర్తి చేసుకొని శివ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.గ్రామంలో ఎక్కడ చూసినా శివ నామస్మరణతో గ్రామ ప్రజలు భక్తిలో లీనమై పోయారు.శివమాల ధరించిన గురుస్వాములు కడారి కష్ణయ్య గురుస్వామి, చెవిటి యాదయ్యగురుస్వామిల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇరుముడి కట్టుకోవడం జరిగింది. పూజ ఈ కార్యక్రమంలో ఈరటి యాదగిరి స్వామి బందం భజన భక్తులను ఆకట్టుకుంది. భక్తిశ్రద్ధలతో స్వామివారి భజన పాటలకు భక్తులు పులకరించి పోయారు. కార్యక్రమానికి విచ్చేసిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు దావ శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో ప్రతి పౌరుడు సనాతనధర్మాన్ని కాపాడటానికి నిత్య నియమాలు పాటిస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు పాటు పడాలన్నారు.తద్వారా భారతదేశం హిందుస్థాన్గా రూపుదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని పిలుపునిచ్చారు. పూజ అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన నిత్య అన్నదాన ప్రభువు, గ్రామ సర్పంచ్ బొడ్డు శ్రీనివాస్ లలిత దంపతులను కడారి వెంకటయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కట్ట సైదులు, రెడ్డిగోని శివ, రాళ్ల శ్రవణ్చారి, చెవిటి మహేష్, చెవిటి శ్రీకాంత్, బొడ్డు సైదులు, స్వాములు, గ్రామంలోని యువకులు దేవర్ ముఖేష్, కట్ట జంగయ్య, పుప్పాల శ్రీకాంత్, కట్ట గిరి, చెవిటి మోహన్, గ్రామంలోని పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.