Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందంపేట
డిండి ప్రాజెక్టుజలాలు చందంపేట, నేరడుగొమ్ము మండలాలకు వచ్చే కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అధికారులకు సూచించారు.సోమవారం మండలంలో కాల్వలను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం సాగు,తాగు నీరందించేందుకు అధికప్రాధాన్యత ఇస్తుంద న్నారు. గతంలో 60 ఏండ్లు పాలించిన పాలకులు చందంపేట, నేరేడు గొమ్ము మండలాలకు కాల్వల ద్వారా జలాలు అందించలేదని,టీఆర్ఎస్ ప్రభుత్వం కాల్వలు మరమ్మతులు చేపట్టి జలాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమావత్ పవిత్ర,రైతుబంధు మండలఅధ్యక్షుడు శిరందాసు కష్ణయ్య,టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు ముత్యాలసర్వయ్య,నీటిపారుదల శాఖ డీఈఈ మనోహర్,ఏఈఈ ప్రియాంక, ఫయాజ్,బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్,రమావత్ మోహన్‌కష్ణ, బొడ్డుపల్లి కష్ణ, పోలేపల్లిఉపసర్పంచ్ సభావట్ రమేష్, మాజీ ఎంపీటీసీ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, గోపి, మాజీ సర్పంచ్ పెద్దులు,అందుగుల సైదులు, శోభన్, దినేష్ పాల్గొన్నారు.