Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
గౌడఉద్యమంలో తనవంతు పాత్రను పోషిస్తున్నందుకు హీరో సుమన్ తనను వెన్నుతట్టి ప్రోత్సహించడం అభినందనీయమని జైగౌడ ఉద్యమం సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పంతంగి వీరస్వామి గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.జాతీయస్థాయిలో ఉన్న గౌడకులస్తులందర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన జాతీయస్థాయి గౌడసంఘం నాయకులంతా నిజమైన హీరోలని, ఇటీవల హైదరాబాదులో జరిగిన వనమహోత్సవ కార్యక్రమంలో వ్యాఖ్యానించినట్టు తెలిపారు.సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో గౌడ కులస్తులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు కషి చేయాలని హీరో సుమన్ సూచించినట్టు స్పష్టం చేశారు. అంతకు ముందు సంఘం జాతీయ అధ్యక్షులు వట్టికూటి రామారావు, సంఘ ం ఉపాధ్యక్షులు బూర మల్సూర్‌గౌడ్ హీరోసుమన్తో తనకి పరిచయం చేసిన అనంతరం ఆయన్ను శాలువాతో సన్మానించా మన్నారు.తన సేవలను, ఉద్యమస్ఫూర్తిని హీరో సుమన్‌కు వివరించగా వీరస్వామిగౌడ్ చిన్న వయస్సులోనే మంచి సేవా కార్యక్రమాలను ఎంచుకున్నాడని, మున్ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పినట్లు వివరించారు.గౌడ కులస్తులనే కాకుండా సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ లాగే ప్రజల మనస్సును గెలవాలని ఆకాకాంక్షించినట్టు తెలిపారు.ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమం సంఘం జాతీయ అధ్యక్షుడు వట్టికూటిరామారావుగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంత మైనందుకు ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు.