Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధ్యక్షకార్యదర్శులుగా కొండసైదులుగౌడ్, ఎల్లావుల వెంకటేష్‌యాదవ్
నవతెలంగాణ-గరిడేపల్లి
గరిడేపల్లి ప్రెస్‌క్లబ్ మండలఅధ్యక్షునిగా కొండ సైదులు రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రెస్‌క్లబ్ సమావేశంలో నూతన ప్రెస్‌క్లబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ప్రధాన కార్యదర్శిగా యల్లావుల వెంకటేష్ యాదవ్,కోశాధికారిగా తాటికొండ లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా రావుల వెంకన్నలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కొండసైదులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం పోరాడతానన్నారు.అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, జర్నలిస్టుల రక్షణకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్‌కార్డులు అన్ని ప్రయివేట్ కార్పొరేట్ హాస్పిటళ్లలో పనిచేసే విధంగా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ముచ్చర్లగోపాలకష్ణ, మేకపోతుల వెంకటేశ్వర్లు, నట్టే కోటేశ్వరరావు, కడారి వెంకటేశ్వర్లు, పాత్రికేయులు కొలిపాకజగదీష్, చాగంటివీరయ్య, నర్సింగ్ నరేష్, వల్లపుదాసు జోష్ పాల్గొన్నారు.