Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఈఓ భిక్షపతి
నవతెలంగాణ-పెద్దవూర
ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాద్యాయులు కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి సూచించారు.సోమవారం కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఆదేశాల మేరకు మండలం లోని పులిచర్ల జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశా లలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలాల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటగదులను పరిశీలించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. పాఠశాలలో అదనపు తరగతి గదులు, మూత్ర శాలలు,బాలురకు రెండు,బాలికలకు రెండు మంజూరు కోసం కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతున్నట్టు తెలిపారు.అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు.ఆయన వెంట ఎంఈఓ బాలునాయక్,కాంప్లెక్స్ జీహెచ్ ఎం.శ్రీనివాస్, చంద్రశేఖర్,సీఆర్పీ పరమేష్, శంకర్ ఉన్నారు.