Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాకేంద్రంలోని బైండ్ల కులస్తులకు వెంటనే ప్రభుత్వ స్థలం ఇప్పించి అట్టి స్థలంలో ఇంటి నిర్మాణం చేయాలని బైండ్ల సంఘం జిల్లా కోశాధికారి వడిసిరి వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైండ్ల కులస్తులతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో 30 ఏండ్ల నుండి కిరాయి ఇండ్లలలోనే అనేక కుటుంబాలు నివసిస్తున్నాయని, వారికి సొంత ఇండ్ల లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.తమ కులానికిచెందిన వారికి ఇండ్లు కిరాయికి ఇవ్వాలంటే ఇంటి యజమానులు ఇండ్లు ఇవ్వకుండా మమ్ములను హేళన చేస్తూ చులకనగా చూస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో బైండ్ల కులస్తులు కందుకూరి. జ్యోతి, సుధబోయిన. కీర్తి,కందుకూరి. నాగమణి, గౌతమి, పడిసిరిజయ, ఉమా, నాగరాజు, కష్ణవేణి, వెంకటమ్మ, చిలుకబంగారి, కందు కూరికమలమ్మ, ఎల్లమ్మ, లక్ష్మమ్మ,పావని,వీరమ్మ, రేణుక, నిర్మల పాల్గొన్నారు.