Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
మండలంలోని భవానీపురం డెక్కన్ సిమెంట్స్‌లో 36 వ గనుల భద్రతా వారోత్సవాలను డెక్కన్ సిమెంట్స్ చీఫ్ జనరల్ మేనేజర్ (వర్క్స్) ఎన్.శ్రీని వాసరాజు సోమవారం జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల13న ప్రారంభమైన ఈ వారోత్స వాలు 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.గనిలో పనిచేసే వారందరూ వ్యక్తిగత భద్రతా పరికరాలను ధరించి, భద్రతా పనివిధానాన్ని పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని చెప్పారు.ప్రతిఒక్కరూ క్రమశిక్షణ అలవర్చు కోవాలన్నారు.ఈ సందర్బంగా గనిలో భద్రతాపరంగా జరిగిన అభివద్ధి గురించి డీజీఎం కల్యాణచక్రవర్తి వివరించారు.ఈ కార్యక్రమంలో జీఎంలు నాగ మల్లేశ్వరరావు, ఎండి.మస్తాన్, డీజీఎం శ్రీనివాసరావు, ఏజీఎంలు పీవీ.రమణారావు, కేవీఎల్.నర్సింహారావు, పి.నర్సింహారెడ్డి, చీఫ్ మేనేజర్లు పీఏ సూర్యనారాయణ, నాగేంద్రుడు, ఎన్ఎస్.ప్రవీణ్‌కుమార్, మేనేజర్లు రమేష్, జీవీ.రమణ,సేఫ్టీఆఫీసర్ వేణు, గని సిబ్బంది,కార్మికులు పాల్గొన్నారు.