Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మండలంలో రేషన్ డీలర్ల నిర్లక్ష్య కారణంగా స్థానిక సివిల్ సప్లరు గోదాంలో చక్కెర నిల్వలు ఉండిపోయాయి. మంగళవారం గోదాంను పరిశీలించగా రికార్డులో గతేడాది 10 క్వింటాళ్ల చక్కెర నిల్వ ఉండగా, ఈ ఏడాది జూన్లో 80 క్వింటాళ్ల చక్కెర నిల్వ ఉన్నట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. నిల్వలు ఉండడం వల్ల ఎలుకలు, బస్తాలకు రంధ్రాలు పెట్టి అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నాయి. తెల్లరేషన్ కార్డుదారులకు చక్కెర నిలిపివేసింది. కేవలం అంత్యోదయ కార్డుదారులకు కేజీ చొప్పున చక్కెర పంపిణీ చేస్తోంది. దీంతో మండలంలో అంత్యోదయ కార్డుదారులకు సుమారు ఐదు నెలల నుండి చక్కెర రావడం లేదు. ప్రతి నెల లబిదారులు చక్కెర ఏది అని ప్రశ్నించగా... ఈసారి చక్కెర రాలేదని, రేషన్ డీలర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ చేతులు దులుపుకుంటున్నారు. పై అధికారుల నిర్లక్ష్యం కారణంగానే, రేషన్ షాపులను తనిఖీ చేయకపోవడమే కారణమని పలువురు లబ్దిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షించి ప్రతి నెలా ప్రభుత్వం అందించే సబ్సిడీ వస్తువులు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ఆన్లైన్లో చెక్ చేస్తా : డీటీసీఎస్ అధికారి విజయ
మండలంలో రేషన్ డీలర్ నిర్వాహకులు చక్కెర కోసం డీలర్లు ఎంతమంది డీడీలు తీస్తున్నారు అనే అంశంపై ఆన్లైన్లో చెక్ చేస్తాను.