Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొడ్డ అంజయ్య
నవతెలంగాణ-చౌటుప్పల్
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఏడాది పాటు అన్నదాతలు సాగించిన ఉద్యమ సూర్తిని తీసుకోని ప్రజాసమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొడ్డ అంజయ్య అన్నారు. మంగళవారం పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు రాగిరి కిష్టయ్య అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ మండల జనరల్‌బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అలంబిస్తున్న నియంత పోకడలకు చరమగీతం పాడి రైతులు చేపట్టిన ఉద్యమానికి మోదీ తలదించక తప్పలేదన్నారు. 374 రోజులు సాగిన ఉద్యమంలో 705మంది రైతులు ప్రాణ త్యాగాల ఫలితమే నూతన వ్యవసాయ చట్టాల రద్దు అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం నాలుగు కోడ్లుగా విభజించి వారి హక్కులను కాలరాస్తోందన్నారు. హక్కులను సాధించుకునేందుకు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి.పాషా, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, శీర్క సంజీవరెడ్డి, ఆదిమూలం నాధీశ్వర్, పొట్ట శ్రీను, బోయ యాదయ్య, కొండ శ్రీశైలం, పిసాటి నాగరాజురెడ్డి, పల్లె శివ, సామిడి నాగరాజురెడ్డి అంతటి అశోక్, బీమిడి ప్రభాకర్‌రెడ్డి, బోదాసు వెంకటేశ్, బొరేం శ్రీనివాస్‌రెడ్డి పిట్టల అక్ష్మయ్య, పి.పురుషోత్తం, ఎల్కరాజు యాదగిరి, బి.బాలరాజు, శీదుగుల యాదమ్మ, అంజమ్మ, సత్తెమ్మ పాల్గొన్నారు.