Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-మోటకొండూరు
ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో కొల్లూరు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో అనేక ప్రజా సమస్యలు తీసుకొని నిరంతరం వాటి పరిష్కారం కోసం పని చేస్తున్న సీపీఐ(ఎం) ఉద్యమాలను బల పరచాల్సిన అవసరం ప్రజలకు, ప్రజాతంత్ర వాదులకు ఉందన్నారు. పార్టీని ఆదరించి విరివిగా విరాళాలు ఇచ్చి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బోలగాని జయరాములు, మండల కమిటీ సభ్యులు భైరపాక సర్వయ్య, కాలియా గోపాల్, తుమ్మల మల్లేశం, నాయకులు వంగపల్లి సాయిలు, చీరాల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.