Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
మున్సిపల్ కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 16 ,17 కలెక్టరేట్ ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సలీమ్ పిలుపునిచ్చారు. మంగళ వారం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మున్సిపల్ కార్మికుల హాజరు పాయింట్ కార్మికులతో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికులకు పీఆర్సీ వేతనాలు ఇవ్వాలని ఏప్రిల్ నుండి ఏరియర్స్ తో సహా చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధిస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం సిగ్గుచేటని అన్నారు. 90శాతం మంది ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల ప్రజలు కార్మికులుగా ఉన్నారని వీరిని పర్మినెంట్ చేయడం ద్వారా దళిత సాధికారత సాధించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఐఎన్టీయూసీి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీల్లో ఇందిరాపార్కు దీక్షలు, 16 ,17 కలెక్టరేట్ వంటావార్పు కార్యక్రమంలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ సీఐటీయూ, ఐఎన్టీయూసీ నాయకులు జక్కల రవికుమార్, కోటగిరి శేఖర్, చింతకాయల సంతోష్, కత్తుల యాదమ్మ ,రమేష్ పెరిక కష్ణ కళ్యాణ్ నాగుల కరుణ తదితరులు పాల్గొన్నారు.