Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో మంగళవారం కాటమయ్య నగర్లో కాటమయ్య గుడి ఆవరణలో రేణుకాఎల్లమ్మ కంఠమహేశ్వర ,మైసమ్మ దేవాలయాల నిర్మాణానికి కొలనుపాక సోమేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు, గౌడ మఠాధిపతి సోమన్న పంతులు, చంద్ర శేఖర్ లుకల్లు గీత పారిశ్రామిక సంఘం లిమిటెడ్ అధ్యక్షులు గణగాని శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా శంకర్‌గౌడ్ మాట్లాడుతూ కాటమయ్య, మైసమ్మ దేవాలయాలు గతంలో ఉన్నప్పటికీ దాదాపు లక్షల రూపాయల వ్యయంతో దేవాలయాలు పునర్నిర్మాణ చేయించి సుందరంగా నిర్మించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ,ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు ప్రారంభానికి త్వరలోనే ప్రణాళిక రూపొందించనున్నట్టు చెప్పారు. త్వరలోనే తేదీ ఖరారు చేయనున్నట్టు చెప్పారు .అంతకుముందు కంఠమహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మొరిగాడి బాలరాజు, కోఆప్షన్ సభ్యులు మొరిగాడి కాటమయ్య , ఘన గాని కిష్టయ్య ,సీసా సత్తయ్య, మాజీ అధ్యక్షులు మొరిగాడి అజరు కుమార్ , డైరెక్టర్లు మొరిగాడి సాగర్, గణగాని రాము, జనగామ మహేష్ ,నాయకులు మొరిగాడి వెంకటేష్ ,సీసా ప్రవీణ్, ఘనగాని శంకరయ్య ,దూడల చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు .