Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యక్తిపై కేసు నమోదు
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి గుప్పుమంటోంది. యువత గంజాయిని తాగుతున్నారు. ఇదే విషయాన్ని మీడియా గత రెండు నెలల క్రితం నుండే పోలీసుల దష్టికి తీసుకు వెళుతూ వారిని అప్రమత్తం చేసింది .మండల కేంద్రంలో మంగళవారం అలేరు బైపాస్ రోడ్ వద్ద గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు పట్టణ శివారులోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి -163 రోడ్డు వద్దకు వెళ్లారు. పట్టణంలోనికి వచ్చే రోడ్డు వైపు నిలబడి ఉన్న పట్టణానికి చెందిన పాము మహేష్ అనుమానాస్పదంగా కనబడ్డాడు. పోలీసులను చూసి అతను పారిపోతుండగా పట్టుకున్నారు. తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న సంచిలో వైట్ పేపర్లలో చుట్టి ఉన్న 24 గంజాయి చుట్టలను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ గణేశ్ నాయక్ పంచనామా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఇద్రీశ్ అలీ తెలిపారు.