Authorization
Fri April 11, 2025 01:11:43 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఓమిక్రాన్ వైరస్ నివారణ కోసం ప్రతిఒక్కరూ కరోనా టీకాను తప్పనిసరిగా వేయిం చుకోవాలని పీహె చ్సీ వైద్యాధికారి సిీహెచ్.శ్రావణ్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కరోనా రెండో డోస్ టీకా శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోవిడ్-19 నుండి, ఒమిక్రాన్ వేరియంట్ నుండి రక్షణ పొందడానికి టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని తెలిపారు. ప్రిన్సిపాల్ సిహెచ్.సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్లు జయపాల్, హరిత ,వెంకటేషం, భరత్, మధుబాబు, విద్యాసాగర్, నరేందర్, శ్రీశైలం, ఫయాజ్, ప్రవీణ్, ఉపేంద్ర పాల్గొన్నారు.