Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
జనవరి 22, 23, 24 తేదీల్లో రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పన్నాల గూడెంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల మాట్లాడుతూ యాసంగి వరి పంటపై ఆంక్షలు విధిస్తూ ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రచారం చేసుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమాలు స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి వంటే పాక వెంకటేశ్వర్లు, శాఖ కార్యదర్శి చెన్నబోయిన నాగమణి, పన్నాల శశికళ, మాజీ ఎంపీపీ సుంకి మన్నెమ్మ, శోభన్, కొండపాక కష్ణ, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.