Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 20, 21 తేదీల్లో ఎంఈవో
కార్యాలయం ఎదుట ధర్నాలు
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నార్కట్పల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న కార్మికులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం మండలకేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం పెంచాలని, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న పరిస్థితుల్లో మెస్చార్జిలను పెంచాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో వారానికి మూడు గుడ్లు అమలు చేస్తూ డబ్బులు సరిపోక అప్పల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లించే ఒక గుడ్డు కేవలం రూ.2 .50 పైసలు మాత్రమే, మార్కెట్ ధర రూ.5 నుంచి 6 ఉన్నదని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గుడ్డు ధర పెంచాలని డిమాండ్ చేశారు. ఈనెల 20 21 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లోనూ ఎంఈఓ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వన్ వన్ దించకపోతే హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర జనవరి 10 ,11 తేదీల్లో 48 గంటల ధర్నా చేస్తామని హెచ్చరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడ తాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బడుగు బలహీన వర్గాల పక్షాన సీపీఐ(ఎం) పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయన్నారు. పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రానున్న సంక్రాంతి వేడుకలకు గ్రామ గ్రామాన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్థాయి , మండల స్థాయి నియోజకవర్గ స్థాయి లో క్రీడా పోటీలు, కోలాటం పోటీలు, వ్యాసరచన ,ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఆర్.వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, మండల మాజీ కార్యదర్శి గాలి నరసింహ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కల్లూరి యాదగిరి ,చింతపల్లి బయన్న ,ఎస్.కె నన్నేసా హెబ్, ఆమన గంటి ఐలయ్య , పులిపల్లి శంకర్ రెడ్డి, దండు రవి, బిక్షం, యాదగిరి రెడ్డి, సైదులు, మంద గోపాల్, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.