Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరాజు
నవతెలంగాణ-మోత్కూరు
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి వెంటనే రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో రాచకొండ రాములమ్మ అధ్యక్షతన నిర్వహించిన మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వకపోవడంతో అర్హులైన పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని, వద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు జనవరి 22, 23, 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బిల్లు యాదగిరి, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల కార్యదర్శులు గుండు వెంకటనర్సు, బుర్రు అనిల్ కుమార్, మద్దెపురం రాజు, నాయకులు దడిపెల్లి ప్రభాకర్, చింతల కష్ణారెడ్డి,చామకూర దశరథ, కందుకూరి నర్సింహ, పందిరి భిక్షం, శ్రీనివాసరావు, యెన్నం వెంకట్‌రెడ్డి, అవిలిమల్లు, పైళ్ల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.