Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
పల్లె పర్యవేక్షణలో భాగంగా మండలంలోని చీమల కొండూరులో సోమవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పర్యటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ముస్త్యాలపల్లిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న సీసీరోడ్లు , అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య , భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మెన్ నలమాస రమేష్ ,గ్రామ సర్పంచ్ జీలుగు కవిత సతీష్ పవన్, ముస్త్యా ల పల్లి సర్పంచ్ గంటేపాక యాదగిరి, ఎంపీటీసీ కంచి లలిత మల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు , మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కంచి మల్లయ్య , మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ అబ్బగాని వెంకట్, మాజీ పీఏసీిఎస్ చైర్మెన్ చందుపట్ల మధుసూదన్ రెడ్డి , యూత్ ప్రెసిడెంట్ గూడూరు శేఖర్ రెడ్డి ,సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ , అనంతారం ఎంపీటీసీ సామల వెంకటేష్ , సర్పంచి మురళి , నాయకులు రేమేష్ పాశం మహేష్ పాల్గొన్నారు.