Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ- వలిగొండ
ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కమిటీ సమావేశం కొండె కిష్టయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లోకి దాన్యం వచ్చి రెండు నెలలు గడిచిందన్నారు. ఇప్పటికీ కొనుగోళ్లు పూర్తికాలేదన్నారు. ఒకపక్క మిల్లర్లు క్వింటాకు ఐదు కిలోల చొప్పున ధాన్యాన్ని దోచుకుంటున్నారన్నారు. వెయిటింగ్ పేరుతో రూ.7 రైతుల వద్ద అన్యాయంగా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డబ్బులు జమ అయ్యేటట్లు ,కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి అయ్యేటట్లు అధికారులను ఆదేశించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య ,మండల కార్యదర్శి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం, రామ్ చందర్, శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు మొగిలి పాక గోపాల్ ,వాకిటి వెంకటరెడ,ి్డ కన్నెగంటి యాదయ్య ,ముత్యాలు, దుబ్బ లింగం, సురేష్ ,బుగ్గ చంద్రమౌళి, భీమ బోయిన జంగయ్య ,తదితరులు పాల్గొన్నారు.