Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
అటవీ భూముల్లో అటవీ పునరుజ్జీవ కార్యక్రమాల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అటవీ అధికారులు, మండల అభివద్ధి అధికారులు, ఉపాధి హామీ అధికారులతో అటవీ పునరుజ్జీవ కార్యక్రమం, అవెన్యూ ప్లాంటేషన్ లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 బ్లాకులలో వచ్చే జనవరి మాసంలో 70 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. అటవీ భూములలో పల్లె ప్రకతి వనాలు ఏర్పాటు చేయాలని, ఒక్కో ఫారెస్ట్ బీట్ అధికారి 10 హెక్టార్లలో ప్లాంటేషన్ చేపట్టాలని తెలిపారు. నేషనల్ హైవే, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్లు, ఇంటర్నల్ రోడ్లకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ నాగిరెడ్డి, శ్యామల, అధికారులు పాల్గొన్నారు.