Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
సరూర్ నగర్ స్టేడియంలో ఈ నెల 7 నుండి 10 వరకు జరిగిన 4 వ రాచకొండ కమీషనరేట్ స్థాయిలోపోలీస్ సిబ్బందికి వివిధ క్రీడా అంశాలలో పోటీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జోన్ నుండి అథ్లెటిక్ విభాగనికి కోచ్గా క్రీడకారునిగా పాల్గొని 2 సిల్వర్ , ఒక బ్రాంజ్ మెడల్ సాధించిన పట్టణానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ ఆంబోజు అనిల్ కుమార్ను జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనుంజనేయులు మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కోశాదికారి గోనురు శ్రీనివాస్, సభ్యులు కుమార్, ఐలయ్య , క్రీడాకారులు సచిన్, నివాస్ సిబ్బంది సిలివేరు సైదులు, మురళి పాల్గొన్నారు.