Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విజయం సాధించిన కోటిరెడ్డి
అ 691 ఓట్ల మెజార్టీతో గెలుపు
అ స్వతంత్య్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఎంసీ కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. రెండో స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి కె.నగేష్ నిలిచారు. ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1,271 ఓట్లకు గాను 1,233 ఓట్లు పోలయ్యాయి. 1183 ఓట్లు చెల్లుబాటు కాగా 50 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 38 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటల తర్వాత మొదలైంది. 9 గంటలకు బండిల్స్ కట్టడం ముగిసింది. ఆ తర్వాత 20 నిమిషాల్లోనే ఫలితం వెలువడింది. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా స్వతంత్య్ర అభ్యర్థులు డా.కె.నగేష్‌కు 226, వంగూరి లక్ష్మయ్యకు 26, కాసర్ల వెంకటేశ్వర్లుకు 06, ఏర్పుల శ్రీశైలంకు 03, బెజ్జం సైదులుకు 0 ఓట్లు వచ్చాయి. ఇందులో మొత్తం 50 ఓట్లు చెల్లలేదు.
గంటలోపే ఎన్నికల ఫలితం..
మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అభ్యర్థి కోటిరెడ్డి విజయం సాధించారు. గెలుపు తర్వాత ధృవీకరణ పత్రం అందజేతలో కొంత ఆలస్యమైంది. విజయం వెలువడిన తర్వాత జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎన్.భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్‌కుమార్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అనం తరం ఎమ్మెల్సీకి ఎన్నిక దృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నిం గ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎన్నికల పరిశీలకులు అహ్మద్ నదీమ్, ఐజీ రంగనాద్లు కలిసి అందజేశారు.
సంబురాల్లో కార్యకర్తలు..
స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎంసీ కోటిరెడ్డి భారీ మోజార్టీతో విజయం సాధించడం పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో భారీగా కార్యకర్తలు కేంద్ర సమీపానికి చేరకున్నారు. కౌంటింగ్ తర్వాత విజయం సాధించిన కోటిరెడ్డికి భారీ పూలమాల వేసి సన్మానించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు.