Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కారణమేంటీ ?
అ ఓట్లు వేయొద్దని చెప్పిన కోమటిరెడ్డి
అ అణగారిన వర్గాలకు పదవుల వస్తే సహించరా
అ ఓటర్లు అమ్ముడు పోవడం దురదృష్టరకం
అ ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్థి నగేష్
సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా కృషి చేశారని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి కె.నగేష్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో సుమారు 70 ఓట్లు ఉంటేనే అభ్యర్థిని పోటీలో పెట్టగా సుమారు 400 ఓట్లు కలిగిన ఈ జిల్లాలో ఉద్దండులమనుకునే నేతలు ఎందుకు అభ్యర్థిని బరిలో పెట్టలేదన్నారు. అందర్నీ సమన్వయం చేసి ఒక్కరిని ఎందుకు పోటీలో పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కనీసం పోటీలో ఉన్న అభ్యర్థికి మద్దతుగా ఉండకపోయినా సరే ఓట్లు వేయొద్దని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్వయంగా యాదాద్రి జిల్లా ఓటర్లకు తనకు ఓట్లు వేయొద్దని చెప్పారని ఆరోపించారు. అయినా తనకు 226 ఓట్లు వచ్చాయని, వంగూరి లక్ష్మయ్యకు కేవలం 26 ఓట్లు వచ్చిన సంగతిని గమనించా లని కోరారు. యాదాద్రి జిల్లాలో ఆయన కోసం పనిచేసి మేమే గెలిపించామే కానీ.. మా కోసం ఆయన ఎక్కడ పనిచేసి గెలిపించింది లేదన్నారు.