Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ గురువారం మండలంలోని అనంతారం పరిధిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముచ్చాల మనోజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు బ్యాండ్ మేళాలతో టపాసుల పేలుల్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్స్ ఈరపాక నర్సింహ, వడిచర్ల లక్ష్మీ కష్ణ యాదవ్, కోళ్ల గంగాధర్, ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరి ప్రసాద్, రాష్త్ర కార్యదర్శి పుట్టా గిరీష్,జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాకునూరి మహేందర్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు కొల్లూరి రాజు, జువ్వాగాని శ్రీధర్ నాయకులు అందే నరేష్, వదిచెర్ల శరత్, గ్యాస్ చిన్నా, సాయి, దర్శన్,సమీర్, ఇర్ఫాన్, టిల్లు, సుర్పంగ చందు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : సికింద్రాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ జాతీయ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ ను గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఆయన నివాసం వద్ద శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలేరు పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఎండీ బాబా పాల్గొన్నారు .