Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరి రూరల్
మండలంలోని బస్వాపురం రిజర్వాయర్ నుండి వివిధ ప్రాంతాలకు నీటిని తరలించేందుకు తీసిన కాల్వలపై బ్రిడ్జీలు నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ కోరారు.గురువారం భువనగిరి మండలం బస్వాపురం, ముత్తిరెడ్డిగూడెం, గంగసాని పల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్తిరెడ్డిగూడెం నుండి యాదగిరిగుట్టకు వెల్లె దారిలో ఉన్న వాగును ప్రజలు, వత్తి దారులు, రైతులు,పాడిరైతులు దాటడానికి (వెల్ల డానికి) తక్షణం బ్రిడ్జిలను నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీమండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కష్ణ, కొండ అశోక్, బస్వాపురం, ముత్తిరెడ్డిగూడెం శాఖా కార్యదర్శులు నరాల చంద్రయ్య, కూకుట్ల కష్ణ, నాయకులు మధ్యపురం బాల్ నరసింహ, ఉడుత విష్ణు, చిక్కుల చంద్రమౌళి, మచ్చ భాస్కర్, మచ్చ మధు, కొండ లక్ష్మయ్య, పుల్లెల మల్లేశం, కాసారం మల్లేష్ రెండు గ్రామాలకు సంబంధించిన ప్రజలు పాల్గొన్నారు.