Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చౌటుప్పల్ ఏసీపీ ఉదరురెడ్డి
నవతెలంగాణ- రామన్నపేట
గ్రామీణ ప్రజలకు భద్రతా భావాన్ని పెంచుతూ మరింత దగ్గర కావడం కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం (కార్డన్ సెర్చ్) నిర్వహిస్తున్నామని చౌటుప్పల్ ఏసీపీ ఉదరు రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని వెల్లంకి గ్రామంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదరు రెడ్డి మాట్లాడుతూ ఈ సెర్చ్ లో ఆరు బెల్టుషాపులను గుర్తించి 2500 విలువచేసే లిక్కర్ బాటిల్ లను, నాలుగు వేల రూపాయల వేల నిషేధిత గుట్కా లను, సిగరెట్ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని చాలన్ విధించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సీిఐ చింత మోతీ రామ్, భువనగిరి ఉమెన్ సర్కిల్ సీఐ సైదులు, సర్కిల్ సర్కిల్ ఎస్ఐలు వెంకటయ్య, రాఘవేంద్ర గౌడ్, ఉదరు కిరణ్, మధు, తొమ్మిది మంది పి ఎస్ ఐ లు, 116 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.