Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
రక్తదానం మరొకరికి ప్రాణదానమని, రక్తదానం చేయడంలో యువత ముందుండాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణారెడ్డి అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గురువారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని హైస్కూల్ చౌరస్తాలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం కొరత కారణంగా సకాలంలో రక్తం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకు రక్తదానం ఒక్కటే మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, జెడ్పీటీసీ గొరుపల్లి శారదసంతోష్ రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పోన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శులు గిరగాని శ్రీను, గజ్జి మల్లేష్, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మీ, మున్సిపల్ వైస్ చైర్మెన్ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు కూరెళ్ల కుమారస్వామి, గనగాని నర్సింహ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, కంచర్ల క్రాంతికుమార్ రెడ్డి, కూరెళ్ల పరమేష్, దాసరి తిరుమలేష్, దామరోజు శ్రీకాంత్, గనగాని రాజేష్, మాజీ ఎంపీటీసీలు జంగ శ్రీను, పానుగుల విష్ణుమూర్తి, సర్పంచులు పేలపూడి మధు, రాంపాక నాగయ్య, దండెబోయిన మల్లేష్, అండెం రాజితరాజిరెడ్డి, ఎలుగు శోభసోమయ్య, ఉప్పల లక్ష్మీ, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ దబ్బెటి రమేష్, గ్రంథాలయ చైర్మెన్ కోమటి మత్స్యగిరి పాల్గొన్నారు.