Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
ఈ నెల 21, 22 తేదీల్లో హుజూర్‌నగర్‌లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) జిల్లా 2వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో వేర్వేరుగా నిర్వహించిన పార్టీ సూర్యాపేట రూరల్, వన్‌టౌన్, త్రీటౌన్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జిల్లా మహాసభల్లో ప్రజలెదుర్కుంటున్న సమస్యలపై చర్చించి ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేయనున్నట్టు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఎన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యాసంగి వరి సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుకుం టున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వరి కొనుగోలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో పార్టీ వన్‌టౌన్ కార్యదర్శి ఎల్గూరి గోవింద్, త్రీటౌన్ కార్యదర్శి మేకనబోయిన శేఖర్, సూర్యాపేట రూరల్ కార్యదర్శి మారం చంద్రారెడ్డి, నాయకులు వల్లపుదాసు సాయి కుమార్, మందడి రాంరెడ్డి, చెరుకు సత్యం, పందిరి సత్యనారాయణరెడ్డి, బోల్ల నాగేందర్‌రెడ్డి, సీహెచ్.యాదగిరి, పొదిల అంజయ్య, మామిడి మరియమ్మ, నల్లమేకల అంజయ్య, నోముల ధనమూర్తి, జలగం సత్తయ్య, మామిడి పుల్లయ్య, షేక్ జహంగీర్, అర్వపల్లి లింగయ్య, జయమ్మ, శశిరేఖ భాగ్యమ్మ, పిట్టల రాణి తదితరులు పాల్గొన్నారు.