Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో బ్యాంకుల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ - సూర్యాపేట
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు యూఎఫ్‌బీయూ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ నాయకులు సైదులు, ఐతగోని మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ఈ కుట్రను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. బ్యాంకులను ప్రయివేటీకరణ చేస్తే డిపాజిట్లపై వడ్డీ రేట్లు, సర్వీస్ చార్జీల పెంపు, కనీస ఖాతా నిలువ పెంపులాంటి చర్యలకు పూనుకుంటారన్నారు. ఉచిత సేవలను సైతం ఎత్తేసి ప్రతి సేవకూ పన్ను వసూలు చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న బ్యాంకులను మూసేసే కుట్ర జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భద్రయ్య, నీలా శ్రీనివాస్, లక్ష్మీకుమారి, వీరన్న, శంకర్రావు, చందూలాల్, శ్రీనివాస్‌రెడ్డి, విజయభాస్కర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.