Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
మండల కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయ నిర్మాణానికి గురువారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తమ పార్టీ అనునిత్యం పోరాడుతుం దన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి మండల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, పుల్లెంల శ్రీకర్, అశోక్‌రెడ్డి, నర్సిరెడ్డి, నగిరె కృష్ణయ్య, ఇందుగుల సర్పంచ్ ఎర్ర కన్నయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.