Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నవతెలంగాణ - హుజూర్నగర్
కోర్టు స్టేలతో కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాసనసభ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు హుజూర్నగర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేశారన్నారు. పబ్లిక్‌హెల్త్ శాఖకు రూ.25 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచినట్టు తెలిపారు. దీనికి కలెక్టర్ కూడా ఆర్డర్ ఇచ్చారని, అయినా కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి హుజూర్నగర్ పట్టణంలోని రోడ్లు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పట్టణంలోని మెయిన్ రోడ్డు, లింగగిరి రోడ్డు, బైపాస్ రోడ్ల పనులన్నీ కోర్టు స్టేలతో ఆగిపోయాయని పేర్కొన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ కడియం వెంకట్‌రెడ్డి, కెఎల్ఎన్.రెడ్డి, చిట్యాల అమర్నాథ్రెడ్డి, తండు హరికృష్ణ, పచ్చిపాల ఉపేందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.