Authorization
Sun April 13, 2025 10:14:17 am
- బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు : తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేయాలనే ఆలోచన విరమించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురు, శుక్రవారాలలో రెండు రోజులపాటు జరుగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఆంధ్ర బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకుల ముందు జరుగుతున్న ధర్నా శిబిరాలను సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ప్రజలకు ప్రభుత్వ బ్యాంకులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రైవేట్ చేయడాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ రైతుల పోరాట స్ఫూర్తితో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ ద్వారా పోరాటాలు ఉధతం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మెకు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండేపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల నాయకుడు బానాల పరిపూర్ణ చారి, బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు ఈశ్వర్ రామకష్ణ అలీ మోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.