Authorization
Fri April 11, 2025 09:37:37 am
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
భువనగిరి నియోజకవర్గ అభివద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్టు అందులో భాగంగా మండలంలో పల్లె పర్యవేక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని బస్వాపురం, ముత్తిరెడ్డిగూడెం, గంగసాని పల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికీ నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించి అన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం గ్రామాల్లో పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పీటీసీ బీర్ మల్లయ్య, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మెన్ నలమాస రమేష్ గౌడ్, గ్రామాల సర్పంచులు కస్తూరి మంజుల శ్రీశైలం, రంపల్లి నాగేష్, సత్యం, మండల అధ్యక్షులు జనగాం పాండు, కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కంచి మల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ అబ్బగాని వెంకట్, ఎంపీటీసీ వెంకటేష్, పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : పేద వారికి గొప్ప వరం కల్యాణ లక్ష్మి అని భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి బాలాజీ ఫంక్షన్ హాల్లో కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు రుణమాఫీ రైతుబంధు కల్యాణలక్ష్మి ,పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ పాక వెంకటేశం భూపాల్ రెడ్డి ,సుధాకర్ రెడ్డి ,మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ,వైస్ చైర్మన్ లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.