Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11వ పీఆర్సీ అమలు చేయాలి
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు నూతన వేతనాలు చెల్లించాలని, 11వ పీఆర్సీఅమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, ఐఎన్టీయూసీి నాయకులు ప్రమోద్ కుమార్ కోరారు. గురువారం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కొత్త వేతనాలు చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట వంటా-వార్పు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, కనీస వేతనాలు చెల్లిస్తామని, కార్మిక చట్టాలు అమలు చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కనీస వేతనాల జీవోలను 11వ పీఆర్సీఅమలు చేయకుండా కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుకులంగా వారి కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని కేటగిరీల వారీగా కార్మికులకు రూ.19,500, డ్రైవర్లకు రూ.22,900, బిల్లు కలెక్టర్లకు రూ.31,040 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మాయ కష్ణ. ఐఎన్టీయూసీి నాయకులు పగల ప్రదీప్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్ ఈరపాక నరసింహ, నాయకులు ముత్యాల బిక్షపతి, శ్రీధర్, కానుకుంట కష్ణ, బాబు, చల్ల రాజయ్య, దాసరి నరసింహ, రాములు, బాలస్వామి, లింగము, నరేష్, రాములు, లావణ్య, చంద్రమ్మ, బుచ్చమ్మ, సప్న, శీను, శాంతమ్మ, కుమారి, వరమ్మ, యాదమ్మ, లక్ష్మి, గిరి, లక్ష్మమ్మ, శారద పాల్గొన్నారు.