Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
- వంటావార్పుతో నిరసన
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు జీవో 60 నెంబర్ ప్రకారం పీఆర్సీని వర్తింపజేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 60 జూన్ లో విడుదల చేసి ఆరు నెలలు గడిచినా మున్సిపల్ కార్మికులకు వర్తింప చేయకపోవడంపై విచారకరమన్నారు. ప్రభుత్వ పాలనలో కొంతమందికి వేతనాలు పెంచి మరికొంతమందికి పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. సఫాయివాలా సలాం అన్న నినాదంతో ముఖ్యమంత్రి ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప కార్మికుల ప్రయోజనాలను కాపాడడం లేదని విమర్శించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా ఉంటూ లాక్ డౌన్ కాలంలో పనిచేసిన కరోనాతో కార్మికులు మతి చెందారు తప్పా వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ నిత్యావసర వస్తువుల పెరుగుదలతో వచ్చిన వేతనాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఈ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగుతుందన్నారు. ఈ రెండు రోజుల నిరసన తోనైనా ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచాలని లేనియెడల జనవరిలో నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. వంటావార్పు చేసుకుని భోజనాలు ఇక్కడే చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఐఎన్టీయూసీ నాయకులు ఎండి.సలీం, దండంపల్లి సత్తయ్య, ఎండి. మొయినుద్దీన్ అద్దంకి నరసింహ జక్కల రవికుమార్ సుంకిశాల వెంకన్న, పెరిక అంజమ్మ, చండూరు, చిట్యాల, నల్లగొండ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు నరసింహారెడ్డి ,పెరిక కష్ణ అరుణ కష్ణవేణి, కోటగిరి శేఖర్ ,కత్తుల యాదమ్మ, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల ధర్నాకు కోమటి రెడ్డి మద్దతు
మున్సిపల్ కార్మికులకు పీఆర్సీని వర్తింపజేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్మికుల శిబిరానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై మద్దతు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని వేతనాలు పెరగడానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ల చేత వేతనాల పెంపు ప్రతి పాదన పెట్టి ఇస్తానని హామీ ఇచ్చారు అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య తదితరులుఉన్నారు.